Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

తెలంగాణ: ఒకటి, రెండు రోజుల్లో పదో తరగతి ఫలితాలు

 

తెలంగాణ: ఒకటి, రెండు రోజుల్లో పదో తరగతి ఫలితాలు 

పదో తరగతి ఫలితాలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోదం తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో ఫలితాలను వెల్లడించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తోంది.

కరోనా తీవ్రత కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఎఫ్ఏ మార్కుల ఆధారంగా తుది మార్కులు కేటాయించి, గ్రేడ్లు ఖరారు చేయాలని ఆదేశిస్తూ ఆ రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు పరీక్ష రుసుం చెల్లించిన 5 లక్షల 21 వేల 393 మందిని ఉత్తీర్ణులు చేసి గ్రేడ్లు ప్రకటించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేసింది.

ఫలితాల విడుదలకు మంత్రి ఆమోద ముద్ర వేయడం వల్ల, మార్కుల అప్​లోడింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నారు. దాదాపు సగం మంది విద్యార్థులకు 10 జీపీఏ దక్కే అవకాశం కనిపిస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags