Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC Civil Services Prelims Exam -2021 Postponed

 

UPSC Civil Services Prelims Exam -2021 Postponed

యూపీఎస్సీ: సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష -2021 వాయిదా

దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి దృష్ట్యా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్‌ పరీక్షలను వాయిదా వేసింది. ఈ ఏడాది జూన్‌ 27న జరగాల్సిన పరీక్షను అక్టోబర్‌ 10న నిర్వహించాలని నిర్ణయించినట్టు కమిషన్‌ వెల్లడించింది. కరోనా ఉగ్రరూపం కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. 

గతేడాది కూడా కరోనా విలయ తాండవంతోనే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. మే 31న జరగాల్సిన ఈ పరీక్షలను కరోనా నేపథ్యంలోనే అక్టోబర్‌ 4కు రీషెడ్యూల్‌ చేశారు. ప్రస్తుతానికి రాత పరీక్షలు పూర్తయినప్పటికీ.. ఇంటర్వ్యూలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు, ప్రస్తుతం వైరస్‌ విజృంభిస్తుండటంతో యూపీఎఎస్సీఅన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఈపీఎఫ్‌వోలో ఇన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీ కోసం మే 9న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసింది. వాయిదా వేసిన పరీక్షలు/ ఇంటర్వ్యూల తదుపరి తేదీలపై అభ్యర్థులకు కనీసం 15 రోజుల ముందుగానే సమాచారం ఇవ్వనున్నట్టు కమిషన్‌ తెలిపింది.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags