Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: రేపటి క్యాబినెట్ ముందుకు PRC అంశం – పి‌ఆర్‌సి కి సంబంధించి రేపు అధికారిక ప్రకటన, ఉత్తర్వులు?

 

TS: రేపటి క్యాబినెట్ ముందుకు PRC అంశం పి‌ఆర్‌సి కి సంబంధించి రేపు అధికారిక ప్రకటన, ఉత్తర్వులు? 

ఉద్యోగుల వేతన సవరణ నివేదికను ఆమోదించనున్న క్యాబినెట్

వేతన సవరణ పూర్తి నివేదికను సమర్పించిన ఆర్థిక శాఖ

ఉద్యోగుల ఫిట్మెంట్, ఇతర అంశాలపై ఉత్తర్వులు విడుదల చేయనున్న సర్కార్

గత అసెంబ్లీ సమావేశాలలో  పిఆర్సీని అసెంబ్లీ లో ప్రకటించిన సీఎం

తెలంగాణలో ఉద్యోగులకు ప్రభుత్వం మంగళవారం నాడు శుభవార్త చెప్పనుంది. ఎందుకంటే రేపటి కేబినెట్ భేటీ ముందుకు పీఆర్సీ అంశం రానుంది. గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పీఆర్సీని ప్రకటించినా.. సంబంధిత ఫైల్ కదలికలో ఇప్పటివరకు పురోగతి లేదు. ఈ క్రమంలో మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో పీఆర్సీ అంశంపై చర్చించే అవకాశం ఉంది.

రేపు ఉద్యోగుల వేతన సవరణ నివేదికను కేబినెట్ ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. వేతన సవరణ పూర్తి నివేదికను ఆర్థిక శాఖ రేపు ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ నేపథ్యంలో పీఆర్పీకి సంబంధించి రేపు అధికారిక ప్రకటన, ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. ఈ మేరకు ఉద్యోగుల ఫిట్‌మెంట్, ఇతర అంశాలపై ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది.

Previous
Next Post »
0 Komentar