Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

డెస్క్‌టాప్‌ వీడియో ‘కాలింగ్‌’ సదుపాయం – ఎలా వాడాలి మరియు డెస్క్‌టాప్‌లో ఉండాల్సిన ఫీచర్స్

 

డెస్క్‌టాప్‌ వీడియో ‘కాలింగ్‌’ సదుపాయం – ఎలా వాడాలి మరియు డెస్క్‌టాప్‌లో ఉండాల్సిన ఫీచర్స్

 

వెబ్, డెస్క్‌టాప్‌ యూజర్ల కోసం వాట్సాప్‌ ఇటీవల వీడియో కాలింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కాలింగ్‌ ఎలా చేయొచ్చు, దాని కోసం ఏమేం అందుబాటులో ఉండాలి అనే వివరాలు ఇవే.

ఎలా వాడాలి?

✠ వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ వెర్షన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. (Download from Microsoft Store)

✠ చాట్‌ చేయాలని అనుకున్నవారిని సెలక్ట్ చేసుకోవాలి.

✠ వీడియో కాల్‌ ఐకాన్‌ మీద క్లిక్‌ చేయాలి.

✠ కాలింగ్‌ సమయంలో మ్యూట్‌, అన్‌మ్యూట్‌ చేయాలంటే మైక్రోఫోన్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేయాలి.

✠ అలానే కెమెరాను ఆన్‌ లేదా ఆఫ్‌ చేసేందుకు కెమెరా ఐకాన్‌ మీద నొక్కాలి.

✠ ఇన్‌కమింగ్‌ కాల్‌ రిసీవ్‌ చేసుకునేందుకు యాక్సెప్ట్ కాల్‌ బటన్‌, ఎండ్‌ చేయాలనుకుంటే డిక్లైన్‌ బటన్‌ను ప్రెస్‌ చేయాలి.

✠ ఒక వేళ ఇన్‌కమింగ్‌ కాల్‌ ఇప్పుడు ఎత్తకూడదనుకుంటే ఇగ్నోర్ లేదా ఎక్స్‌ టు ఇగ్నోర్ ద కాల్‌ బటన్‌ క్లిక్‌ చేయాలి.

డెస్క్‌టాప్‌లో ఉండాల్సిన ఫీచర్స్ :

✠ డెస్క్‌టాప్ తప్పనిసరిగా విండోస్ 10 64bit వెర్షన్‌ 1903 లేదా కొత్త అప్‌డేషన్‌ - మాక్‌ ఓఎస్ 10.13 లేదా కొత్త వెర్షన్‌ ఉండాలి.

✠ డెస్క్‌టాప్‌ వీడియో కాలింగ్‌ చేయాలంటే మైక్రోఫోన్, కెమెరా, స్పీకర్స్‌ తప్పనిసరి.

✠ మంచి ఆడియో కావాలంటే మాత్రం హెడ్‌సెట్‌ను ఏర్పాటు చేసుకోండి.

✠ వర్చువల్‌ ఆడియో, వీడియో డివైజ్‌లు సపోర్ట్‌ చేయవు.

✠ కంప్యూటర్‌ మైక్రోఫోన్‌, కెమెరాను వాడాలంటే వాట్సాప్‌ అనుమతి ఉండాల్సిందే.

✠ డెస్క్‌టాప్‌ ద్వారా గ్రూప్‌ కాలింగ్‌ సదుపాయం లేదు.

Previous
Next Post »
0 Komentar

Google Tags