Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 19-07-2021

 

AP Covid-19 Media Bulletin 19-07-2021

ఏపీలో కొత్తగా 1,628 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 16 వందలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో 71,152 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,628మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో కరోనా బారిన పడిన వారి సంఖ్య 19,41,724కు చేరింది. మరోవైపు 2,744మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 19,05,000 మంది కరోనా నుంచి బయటపడ్డారు.

తాజాగా కరోనాతో పోరాడుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతూ 22మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 5గురు మృతి చెందగా, కృష్ణాలో నలుగురు, గుంటూరు, ప్రకాశంలో ముగ్గురేసి, అనంతపురంలో ఇద్దరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మృతుల సంఖ్య 13,154కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,570 యాక్టివ్‌ కేసులున్నాయి.

AP BULLETIN 19-07-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags