Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE Main April-2021 Admit Card Released - Exam Dates Revised – Details Here

 

JEE Main April-2021 Admit Card Released - Exam Dates Revised – Details Here

జే‌ఈ‌ఈ (మెయిన్) మూడో విడత పరీక్ష తేదీల్లో మార్పులు – అడ్మిట్ కార్డులు విడుదల

జేఈఈ (మెయిన్) మూడో విడత పరీక్ష తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా రెండో దశ నేపథ్యంలో వాయిదా పడి మూడు, నాలుగు విడతల పరీక్ష తేదీలను ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. జులై 20 నుంచి 25 వరకు మూడో విడత, జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు నాలుగో విడత పరీక్ష జరుగుతుందని షెడ్యూలు విడుదల చేశారు. అయితే తాజాగా మూడో విడత పరీక్ష అడ్మిట్ కార్డులు విడదల చేసిన ఎన్టీఏ అందులో పరీక్ష తేదీలను మార్చింది.

మూడో విడత పరీక్ష జులై 20, 22, 25, 27 తేదీల్లో జరగనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 1,09,519 మంది హాజరు కానున్నట్లు వివరించింది. విద్యార్థులు జేఈఈ మెయిన్ వెబ్ సైట్ నుంచి తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలి. మరోవైపు జులై 27 వరకు మూడో విడత పరీక్ష జరనున్న నేపథ్యంలో షెడ్యూలు ప్రకారం అదే రోజు ప్రారంభం కావాల్సిన నాలుగో విడత పరీక్ష తేదీ మారే అవకాశం ఉంది.

NOTICE 13-07-2021

WEBSITE

DOWNLOAD ADMIT CARD

Previous
Next Post »
0 Komentar

Google Tags