Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Wipro Elite National Talent Hunt 2.0 (NTH) 2022 – Details Here

 

Wipro Elite National Talent Hunt 2.0 (NTH) 2022 – Details Here

విప్రో - ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ 2.0 - 2020, 2021, 2022 గ్రాడ్యుయేట్స్ అర్హులు -వివరాలు ఇవే

విప్రో సంస్థ 2022 సంవత్సరానికి గాను ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ 2.0 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఫ్రెషర్ ఇంజినీరింగ్ (2020, 2021, 2022) గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. విప్రో - ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ 2.0 - 2022

పోస్టు: ప్రాజెక్ట్ ఇంజినీర్

అర్హత: బీఈ/బీటెక్ (తప్పనిసరి డిగ్రీ)/ ఎంఈ/ ఎంటెక్ (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు) ఉత్తీర్ణత. ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్ టైల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ బ్రాంచులు మినహాయించి, మిగిలిన అన్ని బ్రాంచుల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

* పదో తరగతి, ఇంటర్మీడియట్, బీఈ/ బీటెక్ లో 60 శాతం/ ఆపైన మార్కులు సాధించి ఉండాలి.

* 2020, 2021, 2022 ఇంజినీరింగ్ అభ్యర్థులు అర్హులు.

వయసు: 25 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: ఏడాదికి రూ.3.50 లక్షలు చెల్లిస్తారు.జాయినింగ్ కాంపన్సేషన్ కింద రూ.3,50,000 అందజేస్తారు. ఎంపిక విధానం: ఆన్లైన్ ఎసెన్మెంట్ - బిజినెస్ డిస్కషన్ - లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ) - ఆఫర్ లెటర్ ఈ విధంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ఆన్లైన్ ఎసెస్మెంట్ పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. పరీక్షా సమయం 128 నిమిషాలు ఉంటుంది.

ఆప్టిట్యూడ్ టెస్ట్: లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఇంగ్లిష్ (వర్బల్) పరీక్షా సమయం 48 నిమిషాలు. రిటన్ కమ్యూనికేషణ్ టెస్ట్: ఎస్సే రైటింగ్ పరీక్షా సమయం 20 నిమిషాలు

ప్రోగ్రామింగ్ టెస్ట్: జావా, సీ, సీ++/ పైథాన్ వీటిలో ఏదో రెండు ప్రోగ్రాముల్లో కోడింగ్ రాయాలి. 60 నిమిషాలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.01.2022

REGISTRATION

WEBSITE



Previous
Next Post »
0 Komentar

Google Tags