Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ACB 14400 Mobile APP

 

ACB 14400 Mobile APP

'ఏసీబీ 14400' – అవినీతి పై ఫిర్యాదు కు ప్రత్యేక యాప్  

లంచం అడిగితే నేరుగా 'ఏసీబీ 14400' యాప్ ద్వారా అవినీతి నిరోధకశాఖకు (ఏసీబీ) ఫిర్యాదు చేయుటకు అందులో ఉన్న వీడియో, ఆడియో ద్వారా లంచం అడిగిన వారి సంభాషణలను రికార్డు చేస్తే.. ఆ వివరాలు నేరుగా ఏసీబీకి చేరతాయి.


యాప్ ఎలా పని చేస్తుందంటే... 

* గూగుల్ ప్లే స్టోర్ నుంచి 'ఏసీబీ 14400' యాప్ డౌన్లోడ్ చేసుకొని.. ఫోన్ నంబరు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

* యాప్ లోని లైవ్ రిపోర్టు విభాగంలో ఫొటో, వీడియో, ఆడియో విభాగాలు ఉంటాయి. లంచం అడిగితే ఆ దృశ్యాలు, సంభాషణలను రికార్డు చేయొచ్చు. అవి నేరుగా ఏసీబీకి చేరుతాయి.

* 'లాడ్జ్ కంప్లైంట్’ విభాగంలోకి వెళ్తే ఏ ప్రభుత్వోద్యోగిపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నారో వారి వివరాలు, ఫిర్యాదు సారాంశం పొందుపరిచేందుకు వీలుంటుంది. ఆ ఫిర్యాదుకు సంబంధించిన ఫొటో, ఆడియో, వీడియో, డాక్యుమెంటు ఆధారాలు కూడా పొందుపరిచేందుకు అవకాశం ఉంటుంది. ఫిర్యాదు పూర్తికాగానే ఫోన్ కు ఒక రెఫరెన్స్ నంబరు వస్తుంది. దాని ద్వారా ఫిర్యాదు స్థితిని ట్రాక్ చేయొచ్చు.

* ప్రస్తుతం ఆండ్రాయిడ్ లోనే ఈ యాప్ అందుబాటులో ఉంది. త్వరలో iOSలోనూ తీసుకురానున్నారు.

DOWNLOAD ACB 14400 APP

Previous
Next Post »
0 Komentar

Google Tags