Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

GATE 2023 Notification Released – Important Details Here

 

GATE 2023 Notification Released – Important Details Here

గేట్-2023 నోటిఫికేషన్ విడుదల – ముఖ్యమైన వివరాలు ఇవే

దేశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష స్కోరు ఉన్నత విద్యతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యో గాల ఎంపికకు సైతం ఉపయోగపడుతుంది.

ఐఐటీలు, నిట్ వంటి విద్యాసంస్థల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ కోర్సులు చేయడానికి గేట్ స్కోర్ తప్పనిసరి. ఈ ఏడాది గేట్ పరీక్షను ఐఐటీ కాన్పూర్ నిర్వహిస్తోంది.

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023

అర్హతలు: ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి లేదు.

ఈ పరీక్ష విధానం: అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్షలో వచ్చిన స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది. 29 సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు 1 లేదా 2 పేపర్లను ఎంపికచేసుకోవచ్చు . ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. 1, 2 మార్కుల ప్రశ్నలుంటాయి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1700(జనరల్ అభ్యర్థులకు), రూ.850 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు)

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 30-08-2022.

ఆన్‌లైన్ రిజిస్టేషన్‌కు చివరి తేది: 30-09-2022.

అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 07-10-2022.

పరీక్ష తేదీలు: 04-02-2023, 05-02-2023, 11-02-2023, 12-02-2023.

పరీక్ష ఫలితాలు విడుదల: 16-03-2023.

పరీక్ష జరిగే పట్టణాలు/నగరాలు:

తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం , కోదాడ, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్.

ఆంధ్ర ప్రదేశ్: అనంతపురం, కర్నూల్, చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం (రాజమండ్రి), శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

APPLY HERE

INFORMATION BROCHURE

GATE-2023 POSTER

SYLLABUS

EXAM PATTERN

WEBSITE

Previous
Next Post »
0 Komentar