Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC Recruitment 2022: Apply for Junior Hindi Translator, Sr Hindi Translator, and Junior Translator – Details Here

 

SSC Recruitment 2022: Apply for Junior Hindi Translator, Sr Hindi Translator, and Junior Translator – Details Here

ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్ 2022: జూనియర్ హిందీ ట్రాన్సలేటర్లు, జూనియర్ ట్రాన్స్ లేటర్లు మరియు సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ల ఖాళీలు – పూర్తి వివరాలు ఇవే

==========================

UPDATE 17-11-2022

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్-2022 (పేపర్-1) తుది కీ, ప్రశ్నపత్రాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ఫలితాలను నవంబర్ 3న ప్రకటించిన విషయం తెలిసిందే. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్లతో కీ, ప్రశ్నపత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కీ వివరాలు నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటాయి.

QUESTION PAPERS & FINAL KEY

WEB NOTE 16-11-2022

WEBSITE

==========================

UPDATE 03-11-2022

SSC JHT Results 2022: ఎస్ఎస్సీ జేహెచ్టీ పరీక్ష-2022 ఫలితాలు విడుదల

కేంద్ర ప్రభుత్వ శాఖలు / విభాగాల్లో జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ ట్రాన్స్ లేటర్, సీనియర్ హిందీ ట్రాన్సలేటర్ నియామకాలు-2022కు సంబంధించి పేపర్-1 రాత పరీక్షను అక్టోబర్ 1న దేశ వ్యాప్తంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలను నవంబర్ 3న ఎస్ఎస్ సీ విడుదల చేసింది.

డిసెంబర్ 4న డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే పేపర్-2 పరీక్షకు మొత్తం 3224 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. తుది కీతో పాటు ప్రశ్నపత్రాలను నవంబర్ 16 నుంచి నవంబర్ 30 వరకు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ పేర్కొంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు రిజిస్టర్డ్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి ఎస్ఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చూసుకోవచ్చు.

SELECTED CANDIDATES LIST

PRESS NOTE

WEBSITE

==========================

భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూదిల్లీలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో కింది గ్రూప్ బి, నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1) జూనియర్ హిందీ ట్రాన్సలేటర్లు

2) జూనియర్ ట్రాన్స్ లేటర్లు

3) సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్లు

విభాగాలు: సెంట్రల్ సెక్రటేరియట్ అఫీషియల్ లాంగ్వేజ్ సర్వీస్, రైల్వే బోర్డు, ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్, వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ట్రాన్స్ లేషన్ లో డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సు ఉండాలి.

వయసు: 01.01.2022 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. 02.01.1992 - 01.01.2004 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (పేపర్-1, పేపర్-2) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, పేపర్ 2 ట్రాన్స్ లేషన్, ఎస్సే రైటింగ్ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.07.2022.

దరఖాస్తులకు చివరి తేది: 04.08.2022.

ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి చివరితేది: 05.08.2022.

చలాన ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 04.08.2022.

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్: అక్టోబరు 2022.

ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 10 ని చూడండి.

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags