Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IBPS Recruitment 2022: Apply for 710 Specialist Officer Posts - Details Here

 

IBPS Recruitment 2022: Apply for 710 Specialist Officer Posts - Details Here

ప్రభుత్వ బ్యాంకుల్లో 710 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు అర్హత మరియు దరఖాస్తు వివరాలు ఇవే

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) . . . వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్పీ ఎస్పీఎల్ XII) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. డిగ్రీ, పీజీ అర్హత - ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా నవంబరు 21 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

రిక్రూట్ మెంట్ లో పాల్గొనే బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్.

1. ఐటీ ఆఫీసర్ (స్కేల్-1): 44 పోస్టులు

2. అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1): 516 పోస్టులు

3. రాజ్ భాష అధికారి (స్కేల్-1): 25 పోస్టులు

4. లా ఆఫీసర్ (స్కేల్-1): 10 పోస్టులు

5. హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1): 15 పోస్టులు

6. మార్కెటింగ్ ఆఫీసర్ ( స్కేల్-1): 100 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 710

అర్హతలు: పోస్టును అనుసరించి బీఈ, బీటెక్ (కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ అప్లికేషన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్). డిగ్రీ (అగ్రికల్చర్ / హార్టికల్చర్ / యానిమల్ హస్బెండరీ / వెటర్నరీ సైన్స్ / డెయిరీ సైన్స్ / ఫిషరీ సైన్స్ / పిసికల్చర్ / అగ్రి. మార్కెటింగ్ & కోఆపరేషన్ / కో-ఆపరేషన్ & బ్యాంకింగ్ / ఆగ్రో-ఫారెస్ట్రీ/ ఫారెస్ట్రీ / అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ / ఫుడ్ సైన్స్ / అగ్రికల్చర్ టెక్నాలజీ బిజినెస్ మేనేజ్ మెంట్ / డెయిరీ టెక్నాలజీ / అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ / సెరికల్చర్). పీజీ (ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ / కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / కంప్యూటర్ అప్లికేషన్స్). పీజీ (హిందీ / సంస్కృతం). డిగ్రీ (ఎల్ ఎల్ బీ), పీజీ డిప్లొమా (పర్సనల్ మేనేజ్ మెంట్ / ఇండస్ట్రియల్ రిలేషన్స్ / హెచ్ఆర్ / హెచ్ ఆర్ డీ / సోషల్ వర్క్, లేబర్ లా). ఎంఎంఎస్ (మార్కెటింగ్) / ఎంబీఏ (మార్కెటింగ్) / పీజీడీబీఏ / పీజీడీబీఎం / పీజీపీఎం / పీజీడీఎం.

వయోపరిమితి: 01.11.2022 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.850 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175).

ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు: చీరాల, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం , వరంగల్.

ముఖ్య మైన తేదీలు…

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.11.2022

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.11.2022.

అడ్మిట్ కార్డు డౌన్లోడ్ (ప్రిలిమినరీ పరీక్ష): డిసెంబర్ 2022.

ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 24.12.2022, 31.12.2022.

ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: జనవరి, 2023.

ఆన్లైన్ మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్లోడ్: జనవరి, 2023.

ఆన్ లైన్ మెయిన్ పరీక్ష తేదీ: 29.01.2023.

తుది పరీక్ష ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి, 2023.

ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్లోడ్: ఫిబ్రవరి, 2023.

ఇంటర్వ్యూ నిర్వహణ: ఫిబ్రవరి / మార్చి, 2023.

ప్రొవిజినల్ అలాట్ మెంట్: ఏప్రిల్, 2023.

DETAILED NOTIFICATION

BRIEF NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar