Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Nest 2023: All the Details Here

 

Nest 2023: All the Details Here

నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 2023 – పూర్తి వివరాలు ఇవే

=====================

సైన్స్, మాథ్స్ కోర్సుల్లో ఉన్నత విద్య దిశగా అడుగులేయాలని ఆశిస్తోన్న ఇంటర్మీడియట్ విద్యార్థులు రాయాల్సిన ముఖ్యమైన పరీక్షల్లో నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్- నెస్ట్-2023 ప్రకటన వెలువడింది. ఇందులో రాణించినవాళ్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైసర్), భువనేశ్వర్; యూనివర్సిటీ ఆఫ్ ముంబయి, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులు చదువుకోవచ్చు. అలాగే ఏడాదికి రూ.60,000 చొప్పున ఐదేళ్లపాటు ఉపకార వేతనం అందుకోవచ్చు. అలాగే వేసవిలో ఇంటర్న్షిప్ కోసం ఏడాదికి రూ.20,000 చొప్పున గ్రాంట్ ఇస్తారు.

నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 2023

సీట్ల రిజర్వేషన్:

నైసర్ (200 సీట్లు): జనరల్- 101, జనరల్ ఈడబ్ల్యూఎస్- 0, ఓబీసీ ఎన్సీఎల్- 54, ఎస్సీ- 30, ఎస్టీ- 15, దివ్యాంగులకు ప్రతి కేటగిరీలో 5% సీట్లు కేటాయించారు.

సీఈబీఎస్ (57 సీట్లు): జనరల్ - 23, జనరల్ ఈడబ్ల్యూఎస్- 6, ఓబీసీ ఎస్సీఎల్- 15, ఎస్సీ- 9, ఎస్టీ- 4, దివ్యాంగులకు ప్రతి కేటగిరీలో 5% సీట్లు కేటాయించారు.

అర్హత: సైన్స్ గ్రూప్ తో 2021, 2022లో ఇంటర్ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం ఉండాలి.

వయసు: ఆగస్టు 1, 2003 తర్వాత జన్మించిన జనరల్, ఓబీసీలు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు గరిష్ఠ వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 27-02-2023 నుంచి

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17-05-2023 వరకు

అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ప్రారంభం: జూన్ 12.

పరీక్ష తేదీ: జూన్ 24.

ఫలితాల ప్రకటన: జులై 10.

ఫీజు: జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.1200. అన్ని వర్గాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. విద్యార్థులు వారి ప్రాధాన్యం ప్రకారం ఐదు పరీక్ష కేంద్రాలు ఎంచుకోవాలి.

========================

HOW TO APPLY

ONLINE APPLICATION

NOTIFICATION

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags