Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JOINT CSIR UGC-NET December 2022 / June 2023: All the Details Here

 

JOINT CSIR UGC-NET December 2022 / June 2023: All the Details Here

జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2022 / జూన్ 2023 - పూర్తి వివరాలు ఇవే

=======================

సైన్స్ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించే... సీఎస్ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ (నెట్) డిసెంబర్-2022 / జూన్-2023కు నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ పరీక్షను నిర్వహించనుంది. సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్ఎఫ్ తోపాటు లెక్చరర్షిప్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతల కోసం నిర్వహించే పరీక్ష- సీఎస్ఐఆర్ యూజీసీ నెట్. ఈ పరీక్ష ద్వారా జేఆర్ఎఫ్ అర్హత పొందితే సీఎస్ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లలో, విశ్వవిద్యాలయాల్లో పీహెచీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్షిప్కు అర్హత పొందితే విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా  ఎంపికకావచ్చు .

జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2022 / జూన్-2023

సబ్జెక్టు వివరాలు: పరీక్షను అయిదు సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు.

1. కెమికల్ సైన్సెస్

2. ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్

3. లైఫ్ సైన్సెస్

4. మ్యాథమేటికల్ సైన్సెస్

5. ఫిజికల్ సైన్సెస్

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ తత్సమాన ఉత్తీర్ణులు / నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎన్- ఎంఎస్ / బీఈ / బీటెక్ / బీఫార్మసీ/ ఎంబీబీఎన్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ(ఎన్సీఎల్), ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్, దివ్యాంగ అభ్యర్థులు అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు పొందాలి.

వయసు: జేఆర్ఎఫ్ కు అర్హతకు సంబంధించి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 01.07.2022 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళ అభ్యర్థులకు అయిదేళ్లు ఓబీసీ (నాన్క్రిమిలేయర్)లకు మూడేళ్ల గరిష్ఠ వయోసడలింపు లభిస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్/ లెక్చరర్షిప్కు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి నిబంధన లేదు.

పరీక్ష విధానం: పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్ష జరుగుతుంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల పద్ధతిలో పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్న పత్రంలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి.

దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.1100, జనరల్ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ(ఎన్సీఎల్) రూ.550, ఎస్సీ/ఎస్టీలకు రూ.275, థర్డ్ జెండర్ రూ.275, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు...

ఫీజు చెల్లింపు, ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.04.2023. 17.04.2023

పరీక్ష తేదీలు: 6, 7, 8.06.2023.

=======================

DATE EXTENSION

REGISTRATION

INFORMATION BULLETIN

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags