Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC Recruitment 2023: Delhi Police and CAPF Examination, 2023 for 1876 SI Posts – Details Here


SSC Recruitment 2023: Delhi Police and CAPF Examination, 2023 for 1876 SI Posts – Details Here

స్టాఫ్ సెలక్షన్ కమిషన్: దిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ 1,876 ఎస్సై పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

==========================

స్టాఫ్ సెలక్షన్ కమిషన్... దిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో సబ్-ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష-2023కు సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా దిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన (సీఏపీఎఫ్) బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్ బీలో సబ్- ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆగస్టు 15లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

1. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్ఓబీ) లో సబ్- ఇన్స్పెక్టర్ (జీడీ): 1714 పోస్టులు

2. దిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)- పురుషులు, మహిళలు: 162 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 1,876.

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.08.2023 నాటికి 20-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ. 35,400-రూ.1,12,400 .

ఎంపిక ప్రక్రియ: సీబీటీ రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (సీఎస్టి), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్.

ముఖ్యమైన తేదీలు...

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.07.2023  

ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 15.08.2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 16.08.2023 నుంచి 17.08.2023 వరకు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: అక్టోబర్, 2023.

==========================

ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 8 ని చూడండి.

NOTIFICATION

WEBSITE

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags