Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Covid Update: 142 New Covid Cases Across the Country - 4 New Covid Cases in Telangana

 

Covid Update: 142 New Covid Cases Across the Country - 4 New Covid Cases in Telangana

దేశవ్యాప్తంగా కొత్తగా 142 కొవిడ్ కేసులు - తెలంగాణలో కొత్తగా నాలుగు కొవిడ్ కేసులు

====================

గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రం లో కొత్తగా నాలుగు కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం (Dec 19) ఆరోగ్య సిబ్బంది 402 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్ తెలిపింది. దాదాపు 6నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ బులిటెన్ విడుదల చేసింది.

====================

దేశవ్యాప్తంగా 142 కొవిడ్ కేసులు - ఇందులో ఒక్క కేరళలోనే 115

కరోనా కేసులపై కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం ఉదయం 8.00 గంటల వరకు (24 గంటల వ్యవధిలో) 115 కొత్త కేసులు వచ్చినట్లు కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో క్రియాశీలక కేసుల సంఖ్య 1,749కి చేరినట్లు తెలిపింది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల మేరకు కేరళతో కలిపి దేశవ్యాప్తంగా మంగళవారం ఉదయానికి నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 142గా ఉంది.

కేరళ ఆరోగ్యమంత్రి వీణాజార్జ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో వైరస్ ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు ఆమె చెప్పారు. కరోనా లక్షణాలతో వచ్చిన వారి నమూనాలను జన్యుక్రమ విశ్లేషణకు పంపాలని, కొవిడ్ పరీక్షలను పెంచాలని సూచించారు. రాష్ట్రంలో ఒక వ్యక్తికి మాత్రమే కొవిడ్ ఉపరకం జె.ఎన్.1 ఒమిక్రాన్ సోకిందని, అతడు కోలుకున్నాడని చెప్పారు.

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags