Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ICC Men's T-20 World Cup 2024: Schedule Released

 

ICC MEN'S T-20 World Cup 2024: Schedule Released

ఐసీసీ పురుషల టీ-20 ప్రపంచకప్ 2024 - షెడ్యూల్ విడుదల – భారత్ ఆడే మ్యాచ్ ల తేదీల వివరాలు ఇవే

====================

UPDATE 30-04-2024

టీ-20 వరల్డ్ కప్ కి ఎంపికైన భారత జట్టు ఇదే

టీ20 ప్రపంచకప్ 2024 కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్య వ్యవహరిస్తారు. ఈ సారి టీ20 ప్రపంచకప్ నకు యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.

రిషబ్ పంత్, యుజ్వేంద్ర చాహల్ ప్రపంచకప్ తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. పంత్ 2022 డిసెంబరు చివర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడి 14 నెలలపాటు ఆటకు దూరమయ్యాడు. ఈ ఐపీఎల్ సీజన్లో పునరాగమనం చేసిన అతడు ఇప్పుడు టీమిండియా తరపున కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చాడు.

CLICK FOR ALL SQUADS

====================

ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్ విడుదల అయ్యింది.

జూన్ 1 నుంచి సిరీస్ ప్రారంభమవుతుందని శుక్రవారం (జనవరి 5) ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. తొలి మ్యాచ్ లో ఆతిథ్య అమెరికాతో కెనడా ఢీ కొట్టనుంది. 'గ్రూప్ ఏ'లో ఉన్న భారత్-పాక్ జట్లు న్యూయార్క్ వేదికగా జూన్ 9న తలపడనున్నాయి.

యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న ఈ పొట్టికప్పు సిరీస్ లో మొత్తం 20 జట్లు తలపడుతున్నాయి. అమెరికాలో 3, వెస్టిండీస్ లో 6 వేదికల్లో మొత్తం 55 మ్యాచ్ లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 29న జరగనుంది.

====================

CLICK FOR FULL SCHEDULE PDF

CLICK FOR FULL SCHEDULE WEBSITE LINK

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags