Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bajaj Chetak Premium & Urbane 2024 Models Launched – Price and Feature Details Here

 

Bajaj Chetak Premium & Urbane 2024 Models Launched – Price and Feature Details Here

బజాజ్ చేతక్ ప్రీమియం & అర్బేన్ 2024 మోడల్స్ విడుదల -  ధర మరియు ఫీచర్ వివరాలు ఇవే

=====================

విద్యుత్ స్కూటర్ చేతక్ మోడల్ 2024 వెర్షన్ ను బజాజ్ ఆటో విపణిలోకి విడుదల చేసింది. చేతక్ ప్రీమియం 2024, చేతక్ అర్బేన్ 2024 వేరియంట్లలో ఇది లభించనుంది. చేతక్ అర్బేన్ ధర రూ.1,15,001, చేతక్ ప్రీమియం ధర రూ.1,35,463 (ఎక్స్-షోరూమ్ దిల్లీ)గా నిర్ణయించారు.

ఇందులో అమర్చిన 3.2 కిలో వాట్ బ్యాటరీ ఒకసారి ఛార్జింగుతో 127 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. బజాజ్ కొత్త చేతక్ గరిష్ఠ వేగం గంటకు 73 కి.మీ. బ్లూటూత్, యాప్ అనుసంధానత, నోటిఫికేషన్ అలర్ట్; వివిడ్ టీఎఫ్ డిస్ప్లే, టీబీటీ నేవిగేషన్ సపోర్ట్, మ్యూజిక్ కంట్రోల్, కాల్ మేనేజ్మెంట్ వంటి సదుపాయాలు ఈ స్కూటర్లలో ఉన్నాయి.

హ్యాజిల్నట్, ఇండిగో మెటాలిక్ బ్లూ, బ్రూక్లిన్ బ్లాక్ రంగుల్లో కొత్త స్కూటర్లు లభిస్తాయి. మరిన్ని అధునాతన ఫీచర్లను జోడించి చేతక్ ప్రీమియం, అర్బేన్ 2024 స్కూటర్లను తీసుకొచ్చినట్లు బజాజ్ అధ్యక్షుడు (అర్బనైట్) ఎరిక్ వాస్ వెల్లడించారు. బజాజ్ విక్రయశాలలు, వెబ్సైట్పై కొత్త స్కూటర్లను బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది.

=====================

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags