Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

LIVE: Ayodhya Ram Mandir - Inauguration Streaming - Ram Lala Pran Pratishtha Ceremony

 

LIVE: Ayodhya Ram Mandir - Inauguration Streaming - Ram Lala Pran Pratishtha Ceremony

ప్రత్యక్ష ప్రసారం: అయోధ్య రామమందిరం - రామ్ లాలా ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రత్యక్ష ప్రసారం

=====================

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సోమవారం (జనవరి 22) అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగియనుంది. ప్రాణ ప్రతిష్ఠకు వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించనున్నాయి. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు 7 వేల మంది పాల్గొననున్నారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందు జరిగే పూజాది కార్యక్రమాలు ఈ నెల 16వ తేదీన ప్రారంభమయి  ఆదివారంతో ముగిశాయి.


అయోధ్య ఆలయ విశేషాలు:  

> రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న విగ్రహం ఎత్తు 51 అంగుళాలు.

> విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించారు.

> శుక్రవారం కళ్లకు వస్త్రంతో ఉన్న విగ్రహం బాహ్య ప్రపంచానికి దర్శనమిచ్చింది.

> ఆలయంలోకి తూర్పు ద్వారం నుంచి ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటకు రావాల్సి ఉంటుందని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.

> ఆలయాన్ని 3 అంతస్తుల్లో నిర్మించారు.

> ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి భక్తులు తూర్పువైపు నుంచి 32 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది.

> ఆలయాన్ని సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు ఉంటుంది. 161 అడుగుల ఎత్తు ఉంటుంది.

> ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తున ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు ఉన్నాయి.

=====================



Previous
Next Post »
0 Komentar

Google Tags