Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jio Cinema: Reliance Jio Launches New Rs. 29 and Rs. 89 Premium Plans – Details Here

 

Jio Cinema: Reliance Jio Launches New Rs. 29 and Rs. 89 Premium Plans – Details Here

తక్కువ ధర తో జియో సినిమా కొత్త ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ లు విడుదల – పూర్తి వివరాలు ఇవే 

=======================

జియో సినిమా రెండు కొత్త ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. పాత ప్లాన్లలోని అధిక ధర, వీడియోలో నాణ్యతలేమి, డివైజ్ల సంఖ్య వంటి పరిమితులను తాజాగా అధిగమించింది.

నెలకు రూ.29:  

కొత్తగా తీసుకొచ్చిన వాటిలో రూ.29, రూ. 89 ప్లాన్లు ఉన్నాయి. నెలకు రూ. 29 చెల్లిస్తే ఒక డివైజ్ లో ఎలాంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా కంటెంట్ ను వీక్షించొచ్చు. అదీ 4కే వీడియో క్వాలిటీతో. పైగా డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లోనూ కంటెంట్ ను ఎంజాయ్ చేయొచ్చు. సినిమాలు, హాలీవుడ్ బ్లాక్బస్టర్లు, పిల్లల షోలు, టీవీ ఎంటర్టైన్మెంట్ను స్మార్ట్ టీవీ సహా ఏ డివైజ్లో నైనా వీక్షించే అవకాశం ఉంటుంది. లైవ్ టెలికాస్ట్లు, స్పోర్ట్స్ మాత్రం యాడ్స్ తో వస్తాయి.

ఫ్యామిలీ ప్లాన్.. - నెలకు రూ.89:

ఫ్యామిలీ కొరకు జియో సినిమా రూ. 89 ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఒకేసారి నాలుగు డివైజ్ కంటెంట్ ను వీక్షించొచ్చు. రూ.29 ప్లాన్ లో ఉన్న అన్ని ఫీచర్లు దీనికి వర్తిస్తాయి. ఇప్పటికే జియోసినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉన్నవారు ఆటోమేటిక్ గా ఫ్యామిలీ ప్లాను అప్గ్రేడ్ అవుతారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ ను యాడ్స్ ఉచితంగానే వీక్షించొచ్చు.

జియోసినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారు ఇంటర్నేషనల్ కంటెంట్ ను స్థానిక భాషల్లోనే ఎంజాయ్ చేయొచ్చు. గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ ది డ్రాగన్ వంటి ప్రముఖ సిరీస్లు సహా పీకాక్, హెచీ బీఓ, ప్యారామౌంట్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ వంటి ప్రధాన స్టూడియోలు నిర్మించిన చిత్రాలు వీక్షించొచ్చు. మోటూ పత్లూ, పోకీమాన్ వంటి పిల్లల షోలు సైతం ఉంటాయి. పైగా పిల్లలు చూసే కంటెంట్ను తల్లిదండ్రులు నియంత్రించే ఆప్షన్ కూడా ఉంటుంది.

=======================

DOWNLOAD JIO CINMEA APP

WEBSITE

=======================


Previous
Next Post »
0 Komentar

Google Tags