Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Ola Electric Slashes S1 X Scooter Prices – Details Here

 

Ola Electric Slashes S1 X Scooter Prices – Details Here

ఓలా స్కూటర్ల ధరలు తగ్గింపు - ఓలా ఎస్1ఎక్స్ (S1 X) ఇక రూ.69,999 కే – ఫీచర్లు & ధరల వివరాలు ఇవే  

======================

ఓలా ఎలెక్టిక్ తన ఎంట్రీ లెవెల్ స్కూటర్లయిన S1 X సిరీస్ ధరలను తగ్గించింది. వీటి ధరలు ఇకపై రూ.69,999 (ఎక్స్ షోరూమ్) నుంచే ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. కొత్త ధరలను కంపెనీ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. తొలిసారి విద్యుత్ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకునే వారి కోసం తక్కువ ధరలకే స్కూటర్లను అందుబాటులో ఉంచినట్లు ఓలా తెలిపింది. డెలివరీలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.

కొత్త ఎస్1 ఎక్స్ మూడు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. 2 kWh వేరియంట్ ధర రూ.69,999 (ప్రారంభ ఆఫర్), 3 kWh బ్యాటరీ వేరియంట్ ధర రూ.84,999, 4 kWh బ్యాటరీ వేరియంట్ ధర రూ.99,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్కూటర్లు 8 ఏళ్లు/80వేల కిలోమీటర్ల బ్యాటరీ వారెంటీతో వస్తున్నాయని కంపెనీ తెలిపింది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఎస్ ఎక్స్ స్కూటర్లు ఫిజికల్ కీ ఇస్తున్నారు. ఇందులో 2 kWh స్కూటర్ ఐడీసీ రేంజ్ 95 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది. 3 kWh స్కూటర్ 143 కిలోమీటర్లు, 4 kwh 190 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

ఎస్ 1ఎక్స్ స్కూటర్లలో 6kW మోటార్ ఉంటుంది. 0-40 కిలో మీటర్ల వేగాన్ని కేవలం 3.3 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది. 2 కిలోవాట్ బ్యాటరీ వేరియంట్ టాప్ స్పీడ్ 85 కిలోమీటర్లు కాగా.. మిగిలిన రెండు స్కూటర్లు గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఎకో, నార్మల్, స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ మోడ్, ఓలా ఎలక్ట్రిక్ యాప్ తో కనెక్టివిటీ వంటి సదుపాయాలు ఉన్నాయి. మొత్తం ఏడు రంగుల్లో ఈ స్కూటర్లు లభిస్తాయని కంపెనీ పేర్కొంది.

======================

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags