Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JOINT CSIR UGC-NET - June 2024: All the Details Here

 

JOINT CSIR UGC-NET - June 2024: All the Details Here

జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2024పూర్తి వివరాలు ఇవే

=======================

సైన్స్ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించే... సీఎస్ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ (నెట్) జూన్-2024 కు నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ పరీక్షను నిర్వహించనుంది. సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్ఎఫ్ తోపాటు లెక్చరర్షిప్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతల కోసం నిర్వహించే పరీక్ష- సీఎస్ఐఆర్ యూజీసీ నెట్. ఈ పరీక్ష ద్వారా జేఆర్ఎఫ్ అర్హత పొందితే సీఎస్ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లలో, విశ్వవిద్యాలయాల్లో పీహెచీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్షిప్కు అర్హత పొందితే విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా  ఎంపికకావచ్చు.

జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2024

సబ్జెక్టు వివరాలు: .

1. కెమికల్ సైన్సెస్

2. ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్

3. లైఫ్ సైన్సెస్

4. మ్యాథమేటికల్ సైన్సెస్

5. ఫిజికల్ సైన్సెస్

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ తత్సమాన ఉత్తీర్ణులు / నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఎన్- ఎంఎస్ / బీఈ / బీటెక్ / బీఫార్మసీ/ ఎంబీబీఎన్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ(ఎన్సీఎల్), ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్, దివ్యాంగ అభ్యర్థులు అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు పొందాలి.

దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.1150, జనరల్ ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ (ఎన్సీఎల్) రూ.600, ఎస్సీ/ఎస్టీలకు రూ.325, థర్డ్ జెండర్ రూ.325, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 01-05-2024

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-05-2024

పరీక్ష తేదీలు: 25, 26 & 27-07-2024.

=======================

APPLY HERE

INFORMATION BULLETIN

PUBLIC NOTICE

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags