IDBI Bank Recruitment
2026: Apply for 1300 Assistant Manager and Jr Assistant Manager Posts – Details
Here
ఐడీబీఐ బ్యాంకులో 1,300 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు - పే స్కేల్: ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల వరకు
=====================
ఐడీబీఐ
బ్యాంకు 2026-27 సంవత్సరానికి దేశవ్యాప్తంగా వివిధ
జోన్లలో 1,300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీనిలో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 'ఓ' 1100 పోస్టులు, 200 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 'ఏ' ఖాళీలున్నాయి.
వివరాలు:
1. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 'ఒ': 1100 పోస్టులు
2.అసిస్టెంట్
మేనేజర్ గ్రేడ్ ‘ఏ’: 200 పోస్టులు
మొత్తం
పోస్టుల సంఖ్య: 1,300.
అర్హతలు:
గ్రేడ్ 'ఒ' పోస్టులకు ఏదైనా
విభాగంలో కనీసం 60 శాతం (జనవరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ)
మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకున్న జోన్కు
సంబంధించిన ప్రాంతీయ భాషలో మాట్లాడటం, చదవడం, రాయడం తెలిసి ఉండాలి.
అసిస్టెంట్
మేనేజర్ గ్రేడ్ 'ఏ' పోస్టులకు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఏదైనా షెడ్యూల్డ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్/ షెడ్యూల్డ్ ప్రైవేట్ సెక్టార్
బ్యాంక్/ కోఆపరేటివ్ బ్యాంక్/ రీజినల్ రూరల్ బ్యాంకులలో కనీసం 2 సంవత్సరాల అర్హత తర్వాత పని అనుభవం ఉండాలి.
వయస్సు: 01.03.2026 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు
పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఇస్తారు.
పే స్కేల్:
ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల మధ్య ఉంటుంది.
ఎంపిక
ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు
రుసుము: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.250; ఇతరులు రూ.1,050.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 08.03.2026
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19.03.2026
=====================
Assistant Manager
=====================
Junior Assistant Manager
=====================

0 Komentar