Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Wimbledon Men’s Final 2026: Sinner defeats Zverev for Second & Consecutive Wimbledon Title – Total 5th Grand Slam Title

 

Wimbledon Men’s Final 2026: Sinner defeats Zverev for Second & Consecutive Wimbledon Title – Total 5th Grand Slam Title

వింబుల్డన్ పురుషుల ఫైనల్ 2026: జ్వెరెవ్‌ను ఓడించి వరుసగా రెండవ వింబుల్డన్ టైటిల్ గెలిచిన సినర్ – మొత్తం గా 5వ గ్రాండ్ స్లామ్ టైటిల్

==================

ఇటలీ టెన్నిస్ ఆటగాడు యానిక్ సినర్ వరుసగా రెండవ వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ గెలిచాడు. గతేడాది తొలిసారి వింబుల్డన్ టైటిల్ ను అందుకున్న 24 ఏళ్ల సినర్.. ఈ సారి కూడా విజేతగా నిలిచాడు. హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈ డిఫెండింగ్ ఛాంపియన్ 6-7(7), 7-6(2), 6-3, 6-4 తేడాతో ప్రపంచ నంబర్ వన్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను ఓడించాడు.

ఈ పోరు మూడు గంటల 46 నిమిషాలపాటు సాగింది. సుదీర్ఘంగా సాగిన మొదటి సెట్లో జ్వెరెవ్ టై బ్రేకర్ ద్వారా గెలుపొందాడు. అయితే సినర్ పుంజుకుని రెండో సెట్ ను టై బ్రేకర్ ద్వారా తన ఖాతాలో వేసుకున్నాడు. మూడో సెట్ లో ఇటలీ ఆటగాడు.. వరల్డ్ నంబర్ వన్ జ్వెరెవ్ సర్వీస్ ను బ్రేక్ చేసి 6-3తో సెట్ ను గెలుచుకున్నాడు. నాలుగో సెట్లోనూ జర్మన్ ఆటగాడి సర్వీస్ ను మరోసారి బ్రేక్ చేసి 6-4తో విజయం సాధించాడు. సింగిల్స్ లో సినర్ కు ఇది ఐదో గ్రాండ్ స్లామ్ టైటిల్.

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags