Wimbledon Women’s Final 2026: Linda
Noskova wins First Grand Slam & First Wimbledon Title
వింబుల్డన్
మహిళల సింగిల్స్ ఫైనల్ 2026: తొలి వింబుల్డన్
టైటిల్&
తొలి గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న 21 ఏళ్ల చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి నోస్కోవా
==================
ఈ ఏడాది వింబుల్డన్
లో నూతన ఛాంపియన్ అవతరించింది. చెకియా అమ్మాయి లిండా నోస్కోవా ఆల్ ఇంగ్లాండ్ క్లబ్
లో విజయకేతనం ఎగరేసింది. ఫైనల్లో ఆమె తన దేశానికే చెందిన కరోలినా ముచోవాను ఓడించి
కెరీర్లో తొలి గ్రాండ్గామ్ టైటిల్ ను చేజిక్కుంచుకుంది.
నోస్కోవా దూకుడైన
ఆటతో వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. శనివారం 2 గంటలకు పైగా సాగిన తుది పోరులో తొమ్మిదో సీడ్ నోస్కోవా 6-2, 5-7, 6-3తో పదో సీడ్ కరోలినా ముచోవా (చెకియా)ను ఓడించింది. ఈ పోరులో
ఆరంభం నుంచి నోస్కోవాదే ఆధిపత్యం. బలమైన సర్వీసులు, మెరుపు క్రాస్ కోర్టు షాట్లతో విజృంభించిన ఆమె తొలి సెట్లో నాలుగో గేమ్ బ్రేక్
సాధించి 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరుతో సెట్ గెలిచింది.
రెండో సెట్
నాటకీయంగా సాగింది. 5-2తో నోస్కోవా టైటిల్ ను
అడుగు దూరంలో నిలిచింది. ఓటమి అంచుల నుంచి ముచోవా అనూహ్యంగా పుంజుకుంది. తర్వాతి
అయిదు గేమ్లను ఖాతాలో వేసుకుని 7-5తో సెట్ గెలిచి
మ్యాచ్లో నిలిచింది.
కానీ
నిర్ణయాత్మక మూడో సెట్ లో నోస్కోవా జోరు ముందు ముచోవా నిలవలేకపోయింది. దూకుడుగా
ఆడి రెండో గేమ్ నే బ్రేక్ సాధించిన నోస్కోవా.. ఆపై 3-0తో నిలిచింది. అదే జోరుతో సెట్తో పాటు టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో
ఆమె 10
ఏస్లు, 44 విన్నర్లు
కొట్టింది. క్విటోవా (21 ఏళ్లు, 2011లో) తర్వాత వింబుల్డన్ మహిళల విజేతగా నిలిచిన పిన్న
వయస్కురాలిగా నోస్కోవా (21 ఏళ్లు) ఘనత
సాధించింది.
==================



0 Komentar