Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Uttar Pradesh Man Finally Gets Government Teacher Job At 59 - Trying Since 1999 (from 27 Years) – Details Here

 

Uttar Pradesh Man Finally Gets Government Teacher Job At 59 - Trying Since 1999 (from 27 Years) – Details Here

1999 నుండి (27 ఏళ్లుగా) ప్రయత్నిస్తున్న ఉత్తరప్రదేశ్ వ్యక్తికి 59 ఏళ్ల వయసులో ఎట్టకేలకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం – వివరాలు ఇవే

===================

1999 నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టారు. దాదాపు 27 ఏళ్ల పాటు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరికి 59 ఏళ్ల వయసులో అనుకున్న ఉద్యోగం సాధించారు. తన ప్రయత్నాల్లో భాగంగా UP కి చెందిన విజయ్ కుమార్ అనేక సార్లు రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా.. ఇంటర్వ్యూల్లోనే ఎదురుదెబ్బ తగిలేది.

ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పరీక్షలో ఆరుసార్లు, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పరీక్షల్లో నాలుగుసార్లు ఉత్తీర్ణులయ్యారు. ఉపాధ్యాయుడిగా పనిచేయాలన్న తపనతో ఓ వైపు స్థానిక ప్రైవేటు పాఠశాలలో పని చేస్తూనే పోటీ పరీక్షలకు సన్నద్ధత కొనసాగించారు.

రిక్రూట్మెంట్ ప్రక్రియ లో అక్కడి ప్రభుత్వం తాజాగా ఇంటర్వ్యూలను ఎత్తివేసింది. ఆ తర్వాతి విడుదలైన టీచర్ పోస్టుల నియామక నోటిఫికేషన్ లో విజయ్ కుమార్ తన కలను సాకారం చేసుకున్నారు.

టీజీటీ సంస్కృతం ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. యూపీలో ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లు కావడంతో... దాదాపు మూడేళ్లు ఆయన ఉపాధ్యాయుడిగా కొనసాగే అవకాశం ఉంది. యూపీలో టీజీటీ, పీజీటీ ఉద్యోగాలకు 62 ఏళ్ల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.

===================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags