APPSC: Notification for 166
Group-1 Posts – Details Here
ఏపీపీఎస్సీ: 166 గ్రూప్-1 పోస్టుల కొరకు
నోటిఫికేషన్ విడుదల – వేతనం: నెలకు రూ.54,060
- రూ.1,54,980
===================
ఆంధ్రప్రదేశ్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-I సర్వీసుల కింద వివిధ
కేటగిరీల పోస్టుల భర్తీకి 166 ఖాళీలతో
నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్సైట్
ద్వారా అక్టోబరు 6 నుంచి 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్ సర్వీస్
డిప్యూటీ కలెక్టర్లు, పోలీస్ సర్వీస్
డీఎస్పీలు, ఎడ్యుకేషనల్ సర్వీస్లో డీఈఓలు, ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్, స్టేట్ ఆడిట్ సర్వీస్ వంటి తదితర 13 ఏపీ
సర్వీసుల్లో 166 ఖాళీలను భర్తీ చేయనుంది.
పోస్టుల
వివరాలు:
1. ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) లో డిప్యూటీ కలెక్టర్లు: 12
2. ఏపీ స్టేట్ టాక్స్ సర్వీస్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్: 14
3. ఏపీ పోలీస్ సర్వీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సివిల్) కేటగిరీ-II: 36
6. ఏపీ
ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో
4. ఏపీ
పోలీస్ సర్వీస్ డిఎస్పీ (కమ్యూనికేషన్స్): 03
5. ఏపీ
ఎడ్యుకేషనల్ సర్వీస్లో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్: 14
6. రీజినల్
ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు: 03
7. ఏపీ
ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్లో డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్: 01
8. ఏపీ
కోఆపరేటివ్ సర్వీస్లో డిప్యూటీ రిజిస్ట్రార్: 16
9. ఏపీ
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II: 12
10.ఏపీ
ట్రెజరీ & అకౌంట్స్ సర్వీస్లో అసిస్టెంట్ ట్రెజరీ
ఆఫీసర్ / అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్: 02
11. ఏపీ
ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజ్ సర్వీస్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్: 03
12. ఏపీ
స్టేట్ ఆడిట్ సర్వీస్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 15
13. ఏపీ
పంచాయతీ రాజ్ సర్వీస్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్: 35
మొత్తం
పోస్టుల సంఖ్య: 166
అర్హతలు:
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి
ఉండాలి. డీఎస్పీ (కమ్యూనికేషన్స్) కు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్
ఇంజినీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ / రేడియో ఇంజినీరింగ్లో
బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి.
వేతనం: నెలకు
డిప్యూటీ కలెక్టర్స్, అసిస్టెంట్ కమీషనర్,
డీఎస్పీ డీఈఓ పోస్టులకు రూ.61,960- రూ.1,51,370; ఆర్ టీఓ, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్,
పోస్టులకు రూ.57,100- రూ.1,47,760; డివిజనల్ డెవలప్మెంట్
ఆఫీసర్కు రూ.65360 - రూ.1,54,980;
ఇతర పోస్టులకు రూ.రూ.54,060 - 1,40,540.
వయోపరిమితి:
డీఎస్పీ(సివిల్)కు 21 నుంచి 30 ఏళ్లు; డీఎస్పీ
(కమ్యూనికేషన్)కు 18 నుంచి 30 ఏళ్లు; ఇతర
పోస్టులకు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక
విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. మొత్తం 825 మార్కులకు
నిర్వహిస్తారు.
స్క్రీనింగ్
టెస్ట్ (ప్రిలిమినరీ పరీక్ష): ఆఫ్లైన్ విధానంలో (ఓఎంఆర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్)
ఉంటుంది. పేపర్-I (జనరల్ స్టడీస్ - 120
మార్కులు), పేపర్-II (జనరల్ ఆప్టిట్యూడ్ - 120 మార్కులు). ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు
నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
మెయిన్స్ రాత
పరీక్ష: డిస్క్రిప్టివ్ పద్ధతిలో రెండు క్వాలిఫైయింగ్ లాంగ్వేజ్ పేపర్లు (తెలుగు, ఇంగ్లిష్) ఐదు జనరల్ కోర్ పేపర్లు (ప్రతి పేపర్కు 150
మార్కులు) ఉంటాయి. ఇంటర్వ్యూ: 75 మార్కులు.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభం: 06.10.2026
ఆన్లైన్ దరఖాస్తు
చివరి తేదీ: 27.10.2026.
ప్రిలిమ్స్
పరీక్ష తేదీ: 24.01.2027
===================
===================


0 Komentar