Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Jio Introduces Voice-Only Prepaid Plans - Details Here

 

Jio Introduces Voice-Only Prepaid Plans - Details Here

జియో నుండి కొత్తగా ఆరు వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌ లు - పూర్తి వివరాలు ఇవే

====================

జియో నూతన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ప్రకటించింది. ఆరు వాయిస్ ఓన్లీ ప్లాన్లను (Jio Voice Only Plans) అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే వీటిల్లో వాయిస్ కాల్స్, మెసేజ్లు మాత్రమే లభిస్తాయి.

డేటాతో సంబంధం లేకుండా కేవలం వాయిస్, ఎస్సెమ్మెస్ ప్లాన్లు మాత్రమే తేవాలని ట్రాయ్ (TRAI) ఇటీవల నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజా జియో కూడా రూ.147, రూ.177, రూ. 196, రూ. 197, రూ. 448 & రూ. 1748 ప్లాన్లను ప్రవేశపెట్టింది. వీటిని అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది.

> రూ.147 ప్లాన్ 22 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. 300 ఎస్సెమ్మెస్ లు లభిస్తాయి.

> రూ.177 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్ + 300 ఎస్సెమ్మెస్ లు అందిస్తుంది.

> రూ.196 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. అపరిమిత వాయిస్ కాల్స్+ 300 ఎస్సెమ్మెస్లు పొందొచ్చు.

> రూ.197 ప్లాన్ క్యాలెండర్ నెల వ్యాలిడిటీతో వస్తోంది. అంటే ఆ నెలలో ఉండే మొత్తం రోజుల పాటు ఈ ప్యాక్ పనిచేస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 ఎస్సెమ్మెస్లు లభిస్తాయి.

> రూ.448 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1000 ఎస్సెమ్మెస్లు లభిస్తాయి.

> రూ.1748 ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 ఎస్సెమ్మెస్లు లభిస్తాయి.

====================

WEBSITE

MOBILE APP – ANDROID

MOBILE APP - iOS

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags