Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Police Recruitment 2026: Apply for 1,156 Police Constable (PC) Posts – Details Here

 

AP Police Recruitment 2026: Apply for 1,156 Police Constable (PC) Posts – Details Here

ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ 2026: ఆంధ్రప్రదేశ్ లో 1,156 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల - పూర్తి వివరాలు ఇవే

===================

ఏపీ లో పోలీస్ శాఖ, డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీసెస్ శాఖ, జైళ్లు & కరెక్షనల్ సర్వీస్ శాఖలలో 1,156 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో కానిస్టేబుల్స్(సివిల్, ఏఆర్), ఫైర్మెన్, వార్డర్ల ఖాళీలున్నాయి. అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి.

1. స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్స్ (సివిల్) (పురుషులు/మహిళలు):  542

2. స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్స్ (ఏఆర్) (పురుషులు/మహిళలు): 285

3. ఫైర్మెన్ (ఫైర్ సర్వీసెస్ శాఖ - పురుషులు): 158

4. వార్డర్లు (జైళ్ల శాఖ - పురుషులు): 150

5. వార్డర్లు (జైళ్ల శాఖ - మహిళలు): 21

మొత్తం పోస్టులు: 1,156

అర్హతలు: అభ్యర్థులు 1 జులై 2026 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం చదివి పరీక్షలకు హాజరై ఉండాలి. వీటితో పాటు నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 1 జులై 2026 నాటికి కానిస్టేబుల్స్ సివిల్, ఏఆర్ కు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి (02-07-2002 నుంచి 01-07-2008 మధ్య జన్మించి ఉండాలి). ఇతర పోస్టులకు 18 నుంచి 32 ఏళ్లు (02-07-1994 నుంచి 01-07-2008 మధ్య జన్మించి ఉండాలి). ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది. మాజీ సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులు, వితంతువులకు ప్రభుత్వ నియమాల ప్రకారం అదనపు సడలింపులు వర్తిస్తాయి.

జీతం: నెలకు రూ.25,220 - రూ. 80,910.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, దేహదారుఢ్య ప్రమాణాల పరీక్ష (PMT), శారీరక సామర్థ్య పరీక్ష (PET), మెయిన్స్ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

పరీక్ష ఫీజు: ఓసీ(ఈడబ్ల్యూఎల్తో సహా), బీసీ(ఏపీ స్థానిక) & నాన్-లోకల్ అభ్యర్థులకు: రూ.300; ఎస్సీ/ఎస్టీ (ఏపీ స్థానిక)లకు రూ.150.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 27/11/2026

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 16/12/2026

రాత పరీక్ష తేదీ: 31/01/2027

===================

APPLY HERE

NOTIFICATION

USER GUIDE

PRESS NOTE

WEBSITE

===================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags