Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Army Rally Recruitment 2021: Apply Online for ARO Visakhapatnam

 

Indian Army Rally Recruitment 2021: Apply Online for ARO Visakhapatnam

ఏపీ: వైజాగ్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ - దరఖాస్తు వివరాలు ఇవే

విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం ఏపీలోని ఆరు జిల్లాలకు (తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, యానాం, `ష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం) చెందిన అభ్యర్థులకు రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ ర్యాలీ ద్వారా సోల్జర్‌- జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌- టెక్నికల్‌, సోల్జర్‌- టెక్నికల్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌, సోల్జర్‌ - క్లర్క్‌/ స్టోర్‌ కీపర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు జూన్‌ 20 నుంచి ఆగస్టు 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

ముఖ్య వివరాలు:

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ (తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, యానాం, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం)

పోస్టులు: సోల్జర్‌- జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌- టెక్నికల్‌, సోల్జర్‌- టెక్నికల్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌, సోల్జర్‌ - క్లర్క్‌/ స్టోర్‌ కీపర్‌ పోస్టులున్నాయి.

అర్హత: పోస్టులను బట్టి ఎనిమిదో తరగతి, 10వ తరగతి, సంబంధిత సబ్జెక్టులతో 10+2/ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి.

వయసు: అభ్యర్థుల వయసు సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ పోస్టులకి 17 ఏళ్ల 6 నెలల నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే మిగతా పోస్టులకి 17 ఏళ్ల 6 నెలల నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌, ఉమ్మడి ప్రవేశ పరీక్ష, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ర్యాలీ నిర్వహణ తేది: ఆగస్టు 16 నుంచి 31 వరకు నిర్వహిస్తారు.

ర్యాలీ నిర్వహణ ప్రదేశం: ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల తేదీలు: ఆగస్టు 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags