Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CISF Constable Recruitment 2022: Apply for 1149 Posts – Details Here

 


CISF Constable Recruitment 2022: Apply for 1149 Posts – Details Here

సీఐఎస్ఎఫ్ లో 1149 కానిస్టేబుల్ పోస్టులు – అర్హత, ఎంపిక విధానం, జీతభత్యాలు మరియు దరఖాస్తు వివరాలు ఇవే

భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకి చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) దేశవ్యాప్తంగా తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

కానిస్టేబుల్/ ఫైర్ (మేల్)

మొత్తం ఖాళీలు: 1149

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణ-30, ఆంధ్రప్రదేశ్-79.

అర్హత: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయసు: 04.03.2022 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు 05.03.1999-04.03.2004 మధ్య జన్మించి ఉండాలి.

జీతభత్యాలు: పే లెవల్-3 ప్రకారం నెలకి రూ.21,700 - 69,100 + ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎసీ, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: పీఈటీ/ పీఎస్టీలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని రాత పరీక్షకి ఎంపిక చేస్తారు. దీన్ని ఓఎంఆర్/ కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ఛాయిస్ రూపంలో ఉంటుంది. దీన్ని ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ లేదు. పరీక్షా సమయం 120 నిమిషాలు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.01.2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 04.03.2022.

NOTIFICATION

LOGIN/REGISTER AND APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags