Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Oscar Nominations 2023: RRR's Naatu Naatu Nominated for Best Original Song – Check All the Nominations Here

 

Oscar Nominations 2023: RRR's Naatu Naatu Nominated for Best Original Song – Check All the Nominations Here

ఆస్కార్ నామినేషన్లు 2023: ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డుకి నామినేట్ అయిన 'ఆర్ఆర్ఆర్’ మూవీ లోని ‘నాటు నాటు’ పాట – పూర్తి నామినేషన్ల జాబితా ఇదే

ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆస్కార్ నామినేషన్స్ జాబితా విడుదల అయింది.  95వ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన చిత్రాలను ది అకాడమీ ప్రకటించింది. భారతీయుల ఆశలకు ఊతం ఇస్తూ, 'ఆర్ఆర్ఆర్' (RRR) లో 'నాటు నాటు' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కు  నామినేట్ అయింది.

వివిధ భాషల నుంచి దాదాపు 300 చిత్రాలు షార్ట్ లిస్ట్ కాగా, అత్యుత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాలను ఓటింగ్ ద్వారా ఆస్కార్ మెంబర్స్ తుది జాబితాకు ఎంపిక చేశారు.  'లగాన్' తర్వాత మరో భారతీయ చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం గమనార్హం. 22 ఏళ్ల కిందట 'లగాన్' ఆస్కార్ తుది జాబితాలో నిలిచినా, అవార్డు దక్కలేదు. అయితే, 'స్లమ్ డాగ్  మిలియనీర్'కు పనిచేసిన ఏ.ఆర్.రెహమాన్, రసూల్ పూకుట్టిలను ఆస్కార్ అవార్డులు వరించాయి.


నామినేషన్ల జాబితా ఇదే

ఉత్తమ చిత్రం..

అవతార్: ది వే ఆఫ్ వాటర్

టాప్ గన్: మావెరిక్

ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్

ది బన్ శీష్ ఆఫ్ ఇనిషెరిన్

ఎల్విస్

ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్

ది ఫేబుల్మ్యాన్స్

టార్

ట్రయాంగిల్ ఆఫ్ సాడ్ నెస్

ఉమెన్ టాకింగ్

 

ఉత్తమ దర్శకుడు..

మార్టిన్ మెక్ డొనాగ్ (ది బన్స్టీస్ ఆఫ్ ఇనిషెరిన్)

డానియెల్ క్వాన్, డానియెల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)

స్టీవెన్ స్పీల్బర్గ్ (ది ఫేబుల్మ్యాన్స్)

టడ్ ఫీల్డ్ (టార్)

రూబెన్ ఆస్టాండ్ (ట్రెయాంగిల్ ఆఫ్ సాడ్ నెస్)


ఉత్తమ నటుడు

ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్)

కొలిన్ ఫార్రెల్ (ది బాన్షీస్ ఆఫ్ ఇనిషైరైన్)

బ్రెండన్ ప్రాసెర్ (ది వేల్)

పాల్ మెస్కల్ (ఆఫ్టర్సన్)

బిల్ నిగీ (లివింగ్)


ఉత్తమ నటి

కేట్ బ్లాంషెట్ (టార్)

అన్నా దె అర్మాస్ (బ్లాండ్)

ఆండ్రియా రైజ్బరో (టు లెస్లీ)

మిషెల్ విలియమ్స్ (ది ఫేబులా మ్యాన్స్)

మిషెల్ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)


మిగతా జాబితా కొరకు క్రింది అధికారిక వెబ్సైట్ లింక్ లో చూడండి

=====================

CLICK FOR OFFICIAL NOMINATIONS LIST

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags