Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP & TS: EAPCET & EAMCET – Inter Marks Weightage Update

 

AP & TS: EAPCET & EAMCET – Inter Marks Weightage Update

===============================

AP EAPCET:

ఈఏపీసెట్ ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ

ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ లో ఇంటర్మీడియట్ మార్కులకు ఈ ఏడాది వెయిటేజీ కొనసాగిస్తున్నారు. గతంలో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకపోవడంతో వెయిటేజీ తొలగించారు.

ఈ ఏడాది ఇంటర్ మార్కులు 25% వెయిటేజీని పునరుద్ధరించారు. ఈఏపీసెట్లో వచ్చే మార్కులు 75%, ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు కేటాయిస్తారు. ఇంటర్మీడియట్లో ఎస్సీ, ఎస్టీలకు 40శాతం, ఇతరులకు 45శాతం మార్కులు తప్పనిసరనే నిబంధన ఉంది.

===============================

AP EAPCET-2023: దరఖాస్తు వివరాలు ఇవే

CLICK HERE

=============================== 

TS EAMCET:

ఇంటర్ మార్కుల వెయిటేజీ శాశ్వతంగా రద్దు

తెలంగాణ ఎంసెట్ లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ బుధవారం (ఏప్రిల్ 19) ఉత్తర్వులు జారీ చేసింది.ఇక నుంచి ఎంసెట్ లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయించనున్నారు. ఇప్పటివరకు ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్లోని భాషేతర సబ్జెక్టులకు... అంటే 600 మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయించేవారు. ఇక నుంచి ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండానే ఎంసెట్లో స్కోర్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

జేఈఈ మెయిన్, నీట్ల లోనూ ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఎత్తివేశారు. ఎంసెట్ కు పలు బోర్డుల నుంచి విద్యార్థులు హాజరవుతారు. ఆయా బోర్డులు సకాలంలో ఫలితాలను విడుదల చేయకపోవడం, ఎంసెట్ అధికారులకు అందజేయకపోవడం వల్ల ఎంసెట్ ఫలితాలకు ఆటంకం ఏర్పడుతోంది. ఇలాంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రతిపాదన మేరకు ఇంటర్ వెయిటేజీని రద్దు చేసింది. కరోనా కారణంగా 2020, 2021, 2022లలో కూడా ఇంటర్ వెయిటేజీని తొలగించారు. ఈసారి దానిని శాశ్వతంగా రద్దు చేస్తూ... గతంలోని జీఓను సవరిస్తూ తాజాగా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీఓ 18ను జారీ చేశారు.

===============================

TS EAMCET-2023: దరఖాస్తు వివరాలు ఇవే

CLICK HERE

===============================

Previous
Next Post »
0 Komentar

Google Tags