Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Australian Open Men’s Singles 2026: Carlos Alcaraz Wins First AO Title – Total 7 Grand Slam Titles

 

Australian Open Men’s Singles 2026: Carlos Alcaraz Wins First AO Title – Total 7 Grand Slam Titles

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026: మొదటి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి, కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించిన కార్లోస్ ఆల్కరాజ్ – మొత్తం గా 7 గ్రాండ్ స్లామ్ లు గెలిచిన స్పెయిన్ టెన్నిస్ ఆటగాడు

=====================

పురుషుల టెన్నిస్ కెరీర్ గ్రాండ్ స్లామ్ పూర్తి చేసిన అతిపిన్నవయస్కుడిగా ప్రపంచ నంబర్ వన్ అల్కరాస్ (స్పెయిన్) చరిత్ర సృష్టించాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో నొవాక్ జకోవిచ్ (సెర్బియా)పై 2-6, 6-2, 6-3, 7-5 తేడాతో అల్కరాస్ విజయం సాధించాడు. 22 ఏళ్ల అల్కరాస్ కు ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఇది తొలి టైటిల్. అతను ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ (2024, 2025), వింబుల్డన్ (2023, 2024), యూఎస్ ఓపెన్ (2022, 2025) టైటిళ్లు సాధించాడు.

మరోవైపు.. జకోవిచ్ కు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ఇది తొలి ఓటమి. అంతకుముందు ఈ టోర్నమెంట్ ఫైనల్ చేరిన పదిసార్లూ అతడు విజేతగా నిలవడం విశేషం. టెన్నిస్ చరిత్రలో అత్యధిక (25) గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లు సాధించాలనుకున్న జకోవిచ్ ఆశలపై అల్కరాస్ నీళ్లుచల్లాడు. ప్రస్తుతం 24 టైటిళ్లతో ఉన్న నొవాక్.. 25వ టైటిల్ కోసం చాలా కష్టపడుతున్నాడు. చివరగా 2023లో యూఎస్ ఓపెన్ గెలిచాక.. అతడు మళ్లీ గ్రాండ్ స్లామ్ కొట్టలేకపోతున్నాడు.

=====================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags