Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Australian Open Women Singles 2026: Rybakina Defeated Sabalenka for First AO Title

 

Australian Open Women Singles 2026: Rybakina Defeated Sabalenka for First AO Title

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ 2026: సబలెంకాను ఓడించి తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ ను గెలిచిన రిబకినా

===================

పోరాటపటిమను ప్రదర్శిస్తూ రిబకినా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను చేజిక్కించుకుంది. రసవత్తరంగా సాగిన ఫైనల్లో ఆమె ప్రపంచ నంబర్ వన్ ఆరీనా సబలెంకాను ఓడించింది. 2023 ఫైనల్లో బెలారస్ స్టార్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. కెరీర్లో రిబకినాకు ఇది రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్.

ఎలెనా రిబకినా ఎట్టకేలకు తన రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలుచుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆమె విజేతగా నిలిచింది. శనివారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో అయిదో సీడ్ రిబకినా 6-4, 4-6, 6-4తో టాప్ సీడ్ అరీనా సబలెంకా (బెలారస్) పై విజయం సాధించింది. రిబకినా 2022 (వింబుల్డన్)లో తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలుచుకుంది. సబలెంకా తన చివరి నాలుగు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ లో మూడు ఓడిపోవడం గమనార్హం. తుది పోరులో రిబకినా ఒత్తిడిని తట్టుకుని నిలిచింది. మ్యాచ్ లో ఆమె 6 ఏస్లు, 28 విన్నర్లు కొట్టింది. మూడుసార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేసింది. సబలెంకా 26 అనవసర తప్పిదాలతో దెబ్బతింది.

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags