NCET 2026:
Integrated Teacher Education Programme (ITEP) – Details Here
నేషనల్ కామన్
ఎంట్రన్స్ టెస్ట్ 2026 - ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రవేశ పరీక్ష – పూర్తి వివరాలు ఇవే
====================
ఇంటిగ్రేటెడ్
బీఈడీ ప్రోగ్రామ్ 2026-27 విద్యా సంవత్సరం
ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్సీఈటీ) 2026 నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తాజాగా
విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 64 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఐటీఈపీ ప్రోగ్రామ్ లో అడ్మిషన్లు పొందవచ్చు.
నాలుగేళ్ల
ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటీఈపీ) 2026:
కోర్సులు:
బీఏ-బీఈడీ, బీకాం-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ.
అర్హత:
ఇంటర్మీడియట్ లేదా పన్నెండో తరగతి/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు
అర్హులు.
వయోపరిమితి:
అభ్యర్థులకు వయోపరిమితి లేదు.
సంస్థలు, సీట్ల వివరాలు: ఎన్సీఈటీ స్కోరు ఆధారంగా జాతీయ స్థాయిలో 64 వివిధ వర్సిటీలు / ఆర్ఎస్ఐఈ / ఎన్ఎస్ఐటీలు, ఐఐటీల్లో ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఈ
సంస్థల్లో 6,100 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
పరీక్ష
విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను అడుగుతారు.
పరీక్ష ఇంగ్లిష్, హిందీతో పాటు 13 భాషల్లో జరుగుతుంది.
దరఖాస్తు
రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.1200; ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.650.
తెలుగు
రాష్ట్రాలలోని పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 12/02/2026
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 10/03/2026
పరీక్ష తేదీ:
17/04/2026
====================
====================


0 Komentar