WhatsApp New Update: Mobile Prepaid Recharge
within the WhatsApp
వాట్సప్ కొత్త
అప్‌డేట్: వాట్సప్ లోనే మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ – ఎలా రీఛార్జ్ చెయ్యాలో తెలుసుకోండి
===================
మెసేజింగ్
యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త సదుపాయం అప్డేట్ తీసుకొచ్చింది.
భారత్లోని వాట్సప్ యూజర్లు యాప్ లోనే మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జి చేసుకునే
వెసులుబాటును తెచ్చింది. జియో, ఎయిర్టెల్, వీఐ.. ఇలా ఏ నెట్వర్క్ వినియోగదారులైనా సంబంధిత ప్లాన్
ఎంపిక చేసుకుని చెల్లింపులు చేయొచ్చు.
భారత్ లోని వినియోగదారులు
తమ రోజువారీ టాస్కులను సులువుగా చేసుకునేందుకు వీలుగా మొబైల్ రీఛార్జి సదుపాయాన్ని
తీసుకొచ్చినట్లు మెటా ఇండియా డైరెక్టర్ రవి గార్గ్ పేర్కొన్నారు. మొబైల్ రీఛార్జి
కోసం వేర్వేరు యాప్లపై ఆధారపడకుండా వాట్సప్లోనే రీఛార్జిని ఎంపిక చేసుకుని పేమెంట్
కూడా చేసే వెసులుబాటును తెచ్చినట్లు వెల్లడించారు. దీంతో పాటు రూపీ సింబల్ ను కూడా
హోమిన్లో కనిపించేట్లు వాట్సప్ అందుబాటులోకి తెచ్చింది.
ఎలా రీఛార్జ్
చెయ్యాలి?
1. వాట్సప్
మొబైల్ రీఛార్జి చేయాలంటే తొలుత రూపీ సింబల్ పై క్లిక్ చేయాలి.
2. అక్కడ
మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జి ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
3. అందులో
మీది గానీ, మీ కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్ గానీ
ఎంటర్ చేయాలి.
4. ఆపరేటర్ ను
ధ్రువీకరించుకున్నాక మీకు నచ్చిన మొబైల్ రీఛార్జి ప్లాన్ ను ఎంపిక చేసుకోవాల్సి
ఉంటుంది.
5. యూపీఐ, డెబిట్ కార్డు, క్రెడిట్
కార్డు సాయంతో చెల్లింపులు చేయొచ్చు.
వాట్సప్
ఇప్పటికే యూపీఐ చెల్లింపులు, మెట్రో టికెట్
బుకింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
===================



0 Komentar