Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Covid Cases Update in AP & Overall India – It Is not a Dangerous Variant, No Need to Panic: Minister

 

Covid Cases Update in AP & Overall India – It Is not a Dangerous Variant, No Need to Panic: Minister

ఏపీ మరియు దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల తాజా పరిస్థితి – ఇది ప్రమాదకరమైన వేరియంట్ కాదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి

=================

ఏపీ లో 13 కొవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జూన్ 26 నుంచి జులై 17 వరకు నాలుగు జిల్లాల్లో 13 కొవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో నలుగురు మృతి చెందినట్లు పేర్కొంది. అయితే మరణించిన వారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వెల్లడించింది. రాష్ట్రంలో 67 మందికి చెందిన నమూనాలు పరీక్షించగా.. 11 మందికి పాజిటివ్ నిర్ధరణ అయినట్టు తెలిపింది. కాకినాడ జిల్లా వాసికి తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు సీఎంసీలో కొవిడ్ నిర్ధరణ అయినట్లు పేర్కొంది.

వేర్వేరు ప్రాంతాల్లో కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒకే చోట గుంపుగా బయటపడలేదు. మరో 5 నమూనాలను పరీక్షల నిమిత్తం పుణె ల్యాబ్ కు పంపాం. స్వీయగృహ నిర్బంధంలో ముగ్గురు, ఇద్దరికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. మరో ముగ్గురు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందు జాగ్రత్తలు పాటించాలి. వైద్యులు, ఆసుపత్రులు, సిబ్బందిని అప్రమత్తం చేశాం.

జులై 1 నుంచి దేశవ్యాప్తంగా 300 కి పైగా  కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో 115, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, అండమాన్ 18, దిల్లీలో 18, రాజస్థాన్ లో 12, ఇతర రాష్ట్రాల్లో మరికొన్ని కొవిడ్ కేసులు నమోదయ్యాయి” అని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కరోనా ప్రమాదకర వేరియంట్ కాదు.. ఆందోళన వద్దు: మంత్రి

కరోనా కేసులపై అప్రమత్తంగా ఉన్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అది ప్రమాదకర వేరియంట్ కాదని, కొవిడ్‌తో పాటు హెమటాలజీ, హైబీపీ కారణంగానే కొందరు మరణించారని చెప్పారు. గత 20 రోజుల్లో కేరళంలో 115, కర్ణాటకలో 64, తమిళనాడులో 39, ఏపీలో 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ తర్వాత అసలు వేరియంట్ తెలుస్తుందన్నారు.

=================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags