Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

French Open Men’s Final 2026: Zverev beats Cobolli to Claim Maiden Grand Slam Title at the age 29

 

French Open Men’s Final 2026: Zverev beats Cobolli to Claim Maiden Grand Slam Title at the age 29

ఫ్రెంచ్ ఓపెన్ 2026: 29 ఏళ్ల వయస్సు లో మొదటి గ్రాండ్ స్లామ్ గెలిచిన జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్

===================

జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ 2014 నుండి గ్రాండ్ స్లామ్ లు ఆడుతున్న ఒక్క టైటిల్ (గ్రాండ్ స్లామ్) కూడా గెలవలేదు, ఎందుకంటే ఆ కాలం లో బిగ్ 3 (ఫెదరర్, నాదల్, జకోవిచ్) లాంటి దిగ్గజాలను ఎదుర్కొనాల్సి వచ్చింది.  ఇంతకు ముందు మూడు సార్లు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో ఫైనల్ కు వెళ్లాడు. అయినా ఆఖరి మెట్టుపై తడబడ్డాడు. జ్వెరెవ్ మళ్లీ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఈసారి ఆటకు అనుభవాన్ని జోడించి.. కీలక సమయంలో ఒత్తిడికి నిలిచి ఫ్రెంచ్ ఓపెన్ రూపంలో తొలి టైటిల్ ను ముద్దాడాడు.

చాలా కాలంగా స్థిరంగా ఆడుతున్నా గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో సత్తా చాటలేకపోతున్న ఈ జర్మనీ ఆటగాడు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి టైటిళ్ల కరువు తీర్చుకున్నాడు. ఆదివారం నాలుగు గంటలకు పైగా హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ తుది పోరులో రెండో సీడ్ జ్వెరెవ్ 6-1, 4-6, 6-4, 6-7 (5-7), 6-1తో పదోసీడ్ ఫ్లావియో కొబోలి (ఇటలీ)పై విజయం సాధించాడు. తొలి సెట్లో జ్వెరెవ్ జోరు ప్రదర్శించాడు. బలమైన ఫోర్హ్యాండ్ షాట్లు, డ్రాప్ షాట్లతో చాలా తేలిగ్గా పాయింట్లు సాధించాడు. ప్రత్యర్థికి ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయిన ఈ జర్మనీ స్టార్ తొలి సెట్ కైవసం చేసుకున్నాడు. కానీ రెండో సెట్లో కొబోలి పుంజుకున్నాడు. నియంత్రణతో కూడిన దూకుడును ప్రదర్శించిన ఈ ఇటలీ కుర్రాడు.. జ్వెరెవ్ కి గట్టిపోటీ ఇచ్చాడు. ఏ దశలోనూ జ్వెరెవ్ కి  బ్రేక్ చేసే అవకాశం ఇవ్వని అతడు.. తొమ్మిదో గేమ్ బ్రేక్ సాధించి 5-4తో ఆధిక్యంలో నిలిచాడు. అదే ఊపులో సెట్ గెలిచి మ్యాచ్లో నిలిచాడు. మూడో సెట్లోనూ గట్టిపోటీనే జరిగినా.. తొమ్మిదో గేమ్ కొబోలి సర్వీస్ బ్రేక్ చేసిన జ్వెరెవ్.. ఆపై సెట్ గెలిచి మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లాడు.


నాలుగో సెట్లో ఒక దశలో జ్వెరెవ్ 3-1తో నిలవడంతో ఈ జర్మనీ స్టార్ ఇక సెట్ తో పాటు మ్యాచ్ గెలుచుకుంటాడనిపించింది. అయితే కొబోలి పట్టు వదల్లేదు. 3-3తో స్కోరు సమం చేశాడు. ఇద్దరూ తగ్గకపోవడంతో సెట్ టైబ్రేకర్ కి మళ్లింది. టైబ్రేకర్ జ్వెరెవ్ ఒక దశలో 3-1తో ఆధిక్యంలో నిలిచినా.. కొబోలి అనూహ్యంగా పుంజుకున్నాడు. ఈ సెట్ను దక్కించుకుని మ్యాచ్ను అయిదో సెట్కు తీసుకెళ్లాడు. అక్కడ నుంచి కొబోలి అలిసిపోయినట్లు కనిపించగా.. ఇలాంటి ఒత్తిడి మ్యాచ్లు ఎన్నో ఆడిన జ్వెరెవ్ కీలక సమయంలో దూకుడు ప్రదర్శించాడు. నిర్ణయాత్మక అయిదో సెట్లో విజృంభించిన ఈ జర్మనీ స్టార్ 4-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అదే జోరుతో సెట్తో పాటు టైటిల్ను కైవసం చేసుకున్నాడు. తొలి గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలవడంతో జ్వెరెవ్ భావోద్వేగానికి గురయ్యాడు.

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags