Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

French Open Women’s Final 2026: Mirra Andreeva Wins First Grand Slam Title by Defeating Maja Chwalińska

 

French Open Women’s Final 2026: Mirra Andreeva Wins First Grand Slam Title by Defeating Maja Chwalińska

ఫ్రెంచ్‌ ఓపెన్‌ - 2026 విజేత గా ఆండ్రీవా – మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన 19 ఏళ్ల రష్యన్ క్రీడాకారిణి

==================

19 ఏళ్ల రష్యా అమ్మాయి ఆండ్రీవా.. చ్వాలిన్స్కా జైత్రయాత్రకు తెరదించి ఫ్రెంచ్ ఓపెన్ ను  గెలిచింది.  1992 (మోనికా సెలెస్) తర్వాత ఈ టైటిల్ గెలిచిన పిన్నవయస్కురాలు ఆండ్రీవానే. రష్యా టీనేజర్ మిరా ఆండ్రీవా సత్తా చాటింది. పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను చేజిక్కించుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఆండ్రీవా 6-3, 6-2తో అన్ సీడెడ్ చాలిస్స్కాను ఓడించింది. మరియా షరపోవా (2014) తర్వాత గ్రాండ్లామ్ టైటిల్ గెలిచిన తొలి రష్యా మహిళగా ఆమె ఘనత సాధించింది. తుది పోరులో ఆండ్రీవా 25 ఏస్లు కొట్టింది. ఏడుసార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేసింది. 10 విన్నర్లు మాత్రమే కొట్టిన చ్వాలిన్స్కా.. 29 అనవర తప్పిదాలతో దెబ్బతింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 114వ స్థానంలో ఉన్న చ్వాలిన్స్కా.. ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన తొలి క్వాలిఫయర్ గా నిలవాలనుకుంది. కానీ ఆండ్రీవా ముందు నిలవలేకపోయింది.

ఫైనల్ ఆరంభంలో ఆండ్రీవా ఒత్తిడిని ఎదుర్కొంది. రసవత్తరంగా మొదలైన తొలి సెట్లో వరుసగా నాలుగు సర్వీసులు బ్రేక్ కావడం విశేషం. తొలి, మూడో గేముల్లో చ్వాల్స్కి.. రెండు నాలుగో గేముల్లో ఆండ్రీవా సర్వీసు కోల్పోయారు. అయిదో గేమ్ సర్వీసు నిలబెట్టుకున్న చ్వాలిన్స్కా 3-2తో నిలిచింది. అయితే మ్యాచ్ సాగుతున్నకొద్దీ పరిస్థితులకు అలవాటుపడ్డ ఆండ్రీవా.. ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆరో గేమ్ సర్వీసు నిలబెట్టుకున్న ఆమె. తర్వాతి గేమ్ లో బ్రేక్ సాధించింది. తిరిగి సర్వీసును కాపాడుకున్న ఆమె.. 9వ గేమ్ బ్రేక్ తో సెట్ను చేజిక్కించుకుంది. రెండో సెట్లో ఆండ్రీవా మరింత చెలరేగిపోయింది. తొలి, నాలుగో గేముల్లో బ్రేక్ లు సాధించిన ఆమె.. 9వ గేమ్ సర్వీసు నిలబెట్టుకుని 5-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆండ్రీవా ఏడో గేమ్ లో సర్వీసును చేజార్చుకున్నా.. వెంటనేబ్రేక్ సాధించి టైటిల్ గెలుచుకుంది.

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags